ఆగష్టు 23న ఇండియా లో విడుదల కానున్న షియోమీ మీ A3

0

జులై 17న స్పెయిన్ లో మీ A2 సక్సెసోర్ మీ A3 ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. ఇండియా లో కూడా ఈ మొబైల్ కోసం చాలా మంది ఎదురు చేస్తున్నారు అయితే విడుదల తేదీ తెలియలేదు. ఇప్పడు మీ A3 మొబైల్ ఆగష్టు 23న ఇండియా లో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షియోమీ బ్రాండ్ మీద వచ్చే స్టాక్ మరియు ప్యూర్ ఆండ్రాయిడ్ ఓస్ తో వచ్చే ఏకైక మొబైల్ A సిరీస్ మొబైల్స్ మాత్రమే.

మీ A3 మొబైల్ ముందు మోడల్ మొబైల్ లాగా ఫుల్ HD డిస్ప్లే తో కాకుండా HD డిస్ప్లే తో వస్తుంది. అయితే ఈ సారి అమోల్డ్ డిస్ప్లే మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే వాటర్ డ్రాప్ డిజైన్ తో వస్తుంది. ఇంకా బ్యాక్ 48ఎంపీ మెయిన్ కెమెరా +8ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్ +2ఎంపీ డెప్స్త్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 32ఎంపీ కెమెరా తో వస్తుంది. మీ A3 మొబైల్ స్నాప్ డ్రాగన్ 665(11nm) ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే హైబ్రిడ్ స్లాట్ మరియు 4జీబీ రామ్ మరియు 64/128జీబీ స్టోరేజ్ లో రానున్నది. ఇంకా బాటరీ 4030mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు టైపు సి పోర్ట్ తో వస్తుంది.

ఈ మొబైల్ కైండ్ అఫ్ గ్రెయ,నాట్ జస్ట్ బ్లూ,మోర్ థాన్ వైట్ కలర్స్ లో లభిస్తుంది.ఈ మొబైల్ ధరను బట్టి సేల్స్ ఆధారపడి ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here