ఆగష్టు 23న విడుదల కానున్న మోటో వన్ యాక్షన్ మొబైల్

0

మోటోరోలా కొన్ని నెలల క్రితం మోటో వన్ విజన్ మొబైల్ ను విడుదల చేసింది. ఇప్పుడు వన్ సిరీస్ లో భాగంగా మరో కొత్త మొబైల్ అంటే వన్ యాక్షన్ అనే మొబైల్ ను ఇండియా లో ఆగష్టు 23న విడుదల చేయనున్నట్లు రుమోర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోటోరోలా IFA2019 ఈవెంట్ లో మోటో వన్ జూమ్ అనే మొబైల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

లీక్స్ ప్రకారం ఈ మొబైల్ సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9609(10nm) ప్రాసెసర్ మరియు మాలి G72 MP3 తో రానున్నది. ఇంకా పేరు బట్టి చుస్తే ఈ మొబైల్ లో యాక్షన్ కెమెరా ను వాడినట్లు తెలుస్తుంది. ఈ మొబైల్ 3/4జీబీ మరియు 34/64జీబీ స్టోరేజ్ వేరియంట్ లో రానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ లో బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ మరియు ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా తో వస్తుంది. ఈ మొబైల్ డిజైన్ ఇంచు మించు మోటో వన్ విజన్ ను పోలి ఉంటుందని తెలుస్తుంది.

ఈ మొబైల్ 21:9 వైడ్ రేషియో తో సినిమా స్క్రీన్ తో రానున్నది. ఈ మొబైల్ ధర యూరోప్ లో లీకైన అమెజాన్ వెబ్ సైట్ ప్రకారం 299యూరోస్ గా వుంది అంటే ఇండియా కరెన్సీ ప్రకారం 24000/-రూపాయలు దాదాపుగా. ఇంత ధరలో ఇండియా లో విడుదల అయితే ఈ మొబైల్ సక్సెస్ అవ్వడం కష్టం. ఇప్పటికే మోటోరోలా ఇండియా లో ధర చాలా ఎక్కువగ్గా పెట్టడం వల్ల ఎవరు మోటోరోలా మొబైల్స్ కొనడానికి ఇష్టపడడం లేదు. చూద్దాం ఈ మొబైల్ ధర ను ఇండియా లో ఎంత పెడుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here