ఆగష్టు 29న విడుదల కానున్న రెడీమి టీవీ మరియు రెడీమి నోట్ 8మొబైల్

0

రెడీమి కంపెనీ టీవీ లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. అంతే కాకుండా రీసెంట్గా రెడీమి టీవీ L70M5అనే మోడల్ నెంబర్ తో చైనా లో 3సి సర్టిఫికేషన్ పొందింది. ఈ సర్టిఫికేషన్ ప్రకారం రెడీమి టీవీ 70ఇంచ్ తో రానున్నది.

అలాగే ఈ 4కే మరియు HDR సపోర్ట్ తో రానున్నది. అంతే కాకుండా బ్లూ టూత్ వాయిస్ రిమోట్ , డాల్బీ మరియు డీటీయస్ , ప్యాచ్ వాల్ యూజర్ ఇంటర్ఫేస్ తో రానున్నది. అయితే ధరకి సంబంధించిన ఎటువంటి సమాచారం మరియు లీక్స్ తెలియలేదు.రెడీమి కంపెనీ ఈ టీవీ ను ఆగష్టు 29న చైనా లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది, దీనికి సంబంధించిన పోస్టర్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. రెడీమి బ్రాండ్ కాబట్టి ఈ టీవీ త్వరలోనే ఇండియా లో కూడా చూడవచ్చు ఎందుకంటే మీ టీవీ లు ఇండియా లో చాలా బాగా ఆదరణ మరియు సేల్స్ కూడా రికార్డు స్థాయిలో వున్నాయి.

రెడీమి టీవీ తో పాటు రెడీమి నోట్ 8 మొబైల్ కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా లీక్స్ ద్వారా తెలుస్తుంది. అయితే నోట్ 8 సిరీస్ లో రెడీమి రెండు మొబైల్స్ ను లేదా ఒక మొబైల్ ను విడుదల చేస్తుందా అనే విషయం తెలియలిసిఉంది. ఇప్పటివరకు అందిన లీక్స్ ప్రకారం రెడీమి నోట్ 8 ట్రిపుల్ కెమెరా సెటప్ లో 64ఎంపీ ప్రైమరీ కెమెరా తో మరియు ఫుల్ HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, టైపు సి పోర్ట్ ,3.5MM హెడ్ ఫోన్ జాక్ తో రానున్నట్లు తెలుస్తుంది. నోట్ 8 సిరీస్ మొబైల్స్ ను ఇండియా లో అక్టోబర్ 2019 లో విడుదల చేయనున్నట్లు సమాచారం. చూద్దాం ఇండియా లో వీటిని ఎపుడు మరియు ధర ఎంత పెడతారో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here