ఆగష్టు 7న విడుదల కానున్న రెడీమి కొత్త మొబైల్ లేదా 64ఎంపీ కెమెరా టెక్నాలజీ

0

ప్రస్తుతం మొబైల్ కెమెరా ప్రపంచం లో 48ఎంపీ కెమెరా హవా నడుస్తుంది. ఇప్పుడు వాటి సక్సెసోర్ అంటే ఫ్యూచర్ కెమెరా 64ఎంపీ కెమెరా సెన్సార్ ను సామ్ సుంగ్ విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే.

రీసెంట్ గా రియల్ మీ కంపెనీ ఆగష్టు 8న 64ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ గురుంచి ఒక ఈవెంట్ ను జరపనున్నట్లు ప్రకటించింది. ఐతే ఇప్పుడు రెడీమి కంపెనీ చైనా లో ఏకంగా 64ఎంపీ కెమెరా మొబైల్ విడుదల చేయనున్నట్లు  లేదా 64ఎంపీ కెమెరా టెక్నాలజీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు సుధాన్షు అంభోర్(ప్రఖ్యాత మీ లీక్ స్టార్) చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూరుస్తుంది.

లీక్స్ ప్రకారం ఈ మొబైల్ లేటెస్ట్ మీడియా టెక్ హీలియో G90 సిరీస్ ప్రాసెసర్ తో రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్ చైనా లో చైనీస్ మినిస్ట్రీ అఫ్ ఇండస్ట్రీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సర్టిఫికేషన్ పొందింది. అంతే కాకుండా 64ఎంపీ కెమెరా తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఈ మొబైల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. మిగతా ఫీచర్స్ గురుంచి ఎటువంటి సమాచారం తెలియలేదు. ఆగష్టు 7న ఈ మొబైల్ కి సంబందిచిన పూర్తి సమాచారం తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here