ఆన్ లైన్ రీఛార్జిస్ కోసం “జియో సారథి” డిజిటల్ అసిస్టెంట్ ను విడుదల చేసిన జియో

0

జియో పేరు తెలియని వారుండరు. జియో మొబైల్ నెట్ వర్క్ రంగంలో ఒక పెనుసంచలనం సృష్టించింది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్లాన్స్ మరియు ఆఫర్స్ తో కస్టమర్స్ కు మరింత చేరువైంది. మొబైల్ నెట్ వర్క్ కి వచ్చిన కొద్దీ కాలంలోనే 30మిలియన్+ సబ్స్క్రైబర్స్ సంపాదించుకొంది.

ఇప్పుడు జియో కొత్తగా “జియో సారథి” అనే డిజిటల్ అసిస్టెంట్ ను విడుదలచేసింది. ఈ అసిస్టెంట్ ద్వారా మనం జియో ఆప్ లో మన సొంతంగా ఆన్ లైన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ” జియో సారథి” ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రీఛార్జ్ అప్ ద్వారా చేసుకోలేదో వారిని ఆన్ లైన్ రీఛార్జిస్ చేసుకునేలా ప్రోత్సహించడం. “జియో సారథి” డిజిటల్ అసిస్టెంట్ ఇప్పటివరకు ఆన్ లైన్ రీఛార్జ్ చేసుకోనివారికి జియో ఆప్ ఓపెన్ చేయగానే అలాగే చేసుకున్నవారికి రీఛార్జ్ విభాగం లో దర్శనమిస్తుంది. “జియో సారథి” రీఛార్జ్ చేసుకునే టైమ్ లో వాయిస్ కమాండ్స్ మరియు సూచనలు అంటే ఆఫర్ సెలెక్ట్ చేసుకోవడం , పేమెంట్ అప్షన్స్ , కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయడం వంటి మొదులుగున్న విషయాలను అందిస్తుంది. “జియో సారథి” ముఖ్యంగా రురల్ ప్రాంతాల్లోని ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది అలాగే వారిని డిజిటల్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తుంది.

ప్రస్తుతానికి “జియో సారథి” డిజిటల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో లభిస్తుంది. రానున్న కొద్దీ రోజుల్లో 12ప్రాంతీయ భాషల్లో కూడా రానున్నట్లు జియో ప్రకటించింది. “జియో సారథి” ఆప్ అప్డేట్ ఆండ్రాయిడ్ మరియు ఐ ఓస్ యూజర్స్ కి అందుబాటులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here