ఒప్పో కంపెనీ ఇండియా లో 10000mAh వూక్ ఫ్లాష్ ఛార్జ్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటే వూక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కంపెనీ చెపుతున్నా దాని ప్రకారం ఒప్పో కే3 మొబైల్ లో 45%ఛార్జింగ్ 30నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.
ఈ పవర్ బ్యాంక్ అల్యూమినియం ఆర్క్ బాడీ తో వస్తుంది. అలాగే పవర్ బ్యాంక్ ఒక పవర్ బటన్ , 1 USB టైప్ A పోర్ట్ , 1 USB టైప్ సి పోర్ట్ అలాగే 4 LED లైట్ ఇండికేటర్స్ ను కలిగి వుంది. ఈ పవర్ బ్యాంక్ 20W వూక్ ఛార్జింగ్ అలాగే డ్యూయల్ ఫ్లాష్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది అంటే ఒకే సారి మొబైల్ ను అలాగే పవర్ బ్యాంక్ ను ఛార్జ్ చేయవచ్చు.
ఈ పవర్ బ్యాంక్ రెండు 5000mAh బ్యాటరీ లను కలిగి ఉండి ఆ రెండు బ్యాటరీ లు డ్యూయల్ సేఫ్ ప్రొటెక్షన్ ను కలిగి వుంది. అంతే కాకుండా పవర్ సర్క్యూట్ కు 13లేయర్ సేఫ్ ప్రొటెక్షన్ అందించబడింది. అంతే కాకుండా ఒప్పో కంపెనీ బాక్స్ లో USB టైపు సి కేబుల్ ను అందిస్తుంది.ఈ పవర్ బ్యాంక్ ఇండియా లో 1499/-రూపాయలకు అమెజాన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.