ఇండియా లో విడుదలైన మీ నెక్ బ్యాండ్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్

0

జులై 17న జరిగిన రెడీమి కే20 సిరీస్ మొబైల్ లాంచ్ ఈవెంట్ లో షియోమీ మొబైల్స్ తో పాటు కొన్ని గాడ్జెట్స్ ను విడుదల చేసింది. వాటిలో మీ నెక్ బ్యాండ్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్ లో లభించే బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ లోకన్నా ఈ ఇయర్ ఫోన్స్ కొంచెం చూడడానికి స్టైలిష్ మరియు కంఫర్ట్ గా ఉంటుంది.

మీ నెక్ బ్యాండ్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ బ్లూ టూత్ 5.0 మీద పని చేస్తుంది. అలాగే 120mAh బ్యాటరీ ద్వారా అంతరాయం లేకుండా 8గంటలపాటు పని చేస్తుంది. డైనమిక్ బాస్ , ట్రిపుల్ ఎక్విలైజషన్ వంటి ఫీచర్స్ ను కలిగివుంది. అలాగే దీని ద్వారా కాల్స్ మాట్లాడుకోవచ్చు ,వాయిస్ అసిస్టెంట్ ద్వారా కాల్స్ మరియు మ్యూజిక్ ను కంట్రోల్ చేయవచ్చు. మీ నెక్ బ్యాండ్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ఇండియా లో 1599రూపాయలకు మీ.కామ్ మరియు ఫ్లిప్కార్ట్ లో జులై 23నుంచి లభించనుంది.

మీ నెక్ బ్యాండ్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ :

1. బ్లూ టూత్ 5.0
2. డైనమిక్ బాస్ , ట్రిపుల్ ఎక్విలైజషన్
3.20mAh బ్యాటరీ మరియు 8గంటలపాటు మ్యూజిక్ ప్లే ,260గంటల స్టాండ్ బై టైం
4.వాయిస్ అసిస్టెంట్ ద్వారా కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్
5.మాగ్నెటిక్ సపోర్ట్ హెడ్ ఫోన్స్ కి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here