ఇండియా లో విడుదలైన రియల్ మీ X2 ప్రో

0

ఇండియా లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ కంపెనీలో రియల్ మీ కంపెనీ ముందు ఉంటుంది. అలాగే మిడ్ మరియు లోమిడ్ రేంజ్ మొబైల్స్ లో రియల్ మీ కంపెనీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. రియల్ మీ స్థాపించిన కొద్దీ కాలం లోనే మీ కంపెనీ కి పోటీ ఇచ్చే స్థాయి కి ఎదిగింది. ఇప్పడు రియల్ మీ ఫ్లాగ్ షిప్ కిల్లర్ క్యాటగిరీ లో కూడా తన సత్తా చాటనున్నది. రియల్ మీ ఇండియా లో X2 ప్రో మొబైల్ ను విడుదల చేసింది. అయితే రియల్ మీ కంపెనీ ఇండియా లో కొంచెం లేటుగా విడుదల చేసింది.

 

ఈ మొబైల్ అసలైన ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఏ మొబైల్ లో రాని 50W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ . కంపెనీ చెపుతున్నా దాని ప్రకారం 4000mAh బ్యాటరీ ని కేవలం 35నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఇంకా ఈ మొబైల్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 855+ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU తో వస్తుంది. బ్యాక్ 64+13+8+2ఎంపీ తో కూడిన క్వాడ్ కేమెరా సెటప్ మరియు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ లేటెస్ట్ ఫీచర్ అయినా 90HZ తో కుడైన సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది.

రియల్ మీ X2 ప్రో స్పెసిఫికేషన్స్ :
1. స్నాప్ డ్రాగన్ 855+ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU తో
2.6.5ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే 20:9యాస్పెక్ట్ రేషియో తో వాటర్ డ్రాప్ డిజైన్ తో మరియు 90HZ రిఫ్రెష్ రేట్ ,HDR10+సపోర్ట్ తో
3.బ్యాక్ 64ఎంపీ మెయిన్ +13ఎంపీ టెలి ఫోటో +8ఎంపీ వైడ్ అంగెల్ +2ఎంపీ డెప్త్ కెమెరా లతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్
4.ఫ్రంట్ 16ఎంపీ కెమెరా
5.8/12జీబీ రామ్ మరియు 128/256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో
6.ఆండ్రాయిడ్ 9.0 మరియు కలర్స్ ఓస్ తో
7.4000mAh బ్యాటరీ 50W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో
8.డ్యూయల్ GPS మరియు స్టీరియో స్పీకర్స్

రియల్ మీ X2 ప్రో మొబైల్ లూనార్ వైట్ నెప్ట్యూన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. 8+128జీబీ వేరియంట్ ధర 29999/- మరియు 12+256జీబీ వరైట్ ధర 33999/-లకు లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here