ఊహించని ధరలో ఇండియా లో విడుదలైన మోటో వన్ యాక్షన్ మొబైల్

0

మోటోరోలా కంపెనీ వన్ సిరీస్ లో భాగంగా మోటో వన్ యాక్షన్ అనే మొబైల్ ను ఇండియా లో విడుదల చేసింది. అయితే మోటోరోలా గతం లో విడుదల చేసిన మొబైల్స్ ధరల చాలా ఎక్కువగా పెట్టేది . ఈసారి అందరిని ఆశ్ఛర్యపరుస్తూ , వూహించని ధర లో కేవలం 13999/-రూపాయలకు ఈ మొబైల్ ను ఇండియా లో విడుదల చేసింది.

ఒక సారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చుస్తే ఈ మొబైల్ సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9609(10nm) ప్రాసెసర్ మరియు మాలి G72MP3 GPU తో వస్తుంది. ఈ ప్రాసెసర్ పనితీరు ఇంచు మించు ఎక్సీనోస్ 9610(10nm) వలె ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ 6.3ఇంచ్ ఫుల్ HD+ ఎల్సిడి మరియు 21:9 రేషియో తో వస్తుంది. ఈ మొబైల్ లో మోటోరోలా హైలైట్ చేసేది యాక్షన్ కెమెరా గురుంచి. మోటో వన్ యాక్షన్ మొబైల్ 12ఎంపీ ప్రైమరీ కెమెరా మరియు 16ఎంపీ 117డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ వీడియో కెమెరా మరియు 5ఎంపీ డెప్త్ కెమెరా తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ 12ఎంపీ పంచ్ హోల్ కెమెరా తో లభిస్తుంది. ఈ మొబైల్ టైపు సి పోర్ట్,3500mAh బ్యాటరీ , 10W చార్జర్ తో వస్తుంది.

మోటో వన్ యాక్షన్ మొబైల్ స్పెసిఫికేషన్స్:
1.6.3ఇంచ్ ఫుల్ HD+ ఎల్సిడి మరియు 21:9 రేషియో తో
2.సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9609(10nm) ప్రాసెసర్ మరియు మాలి G72MP3 GPU
3.4జీబీ రామ్ మరియు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 512జీబీ వరకు ఎక్సపండబుల్
4.ఆండ్రాయిడ్ 9.0 మరియు ఆండ్రాయిడ్ వన్ ఓస్ తో
5.12ఎంపీ ప్రైమరీ +16ఎంపీ 117డిగ్రీ అల్ట్రా వైడ్ అంగెల్ వీడియో కెమెరా +5ఎంపీ డెప్త్ కెమెరా
6.ఫ్రంట్ 12ఎంపీ పంచ్ హోల్ కెమెరా
7.3500mAh బ్యాటరీ మరియు టైపు సి పోర్ట్ తో
8. హైబ్రిడ్ సిమ్ స్లాట్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ ఎక్సక్లూసివ్ గా ఆగష్టు 30నుండి సేల్ కి రానున్నది. ఈ మొబైల్ డెనిమ్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్స్ లో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్స్ లో భాగంగా జియో యూజర్స్ కి 2200/- క్యాష్ బ్యాక్(జియో వోచర్స్) మరియు 125జీబీ అదనపు డేటా లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here