ఎయిర్ టెల్ 399/-,448/- మరియు 499/- ప్లాన్స్ కు 400ఎంబీ ఉచిత అదనపు డేటా

0
659

జియో కు పోటీగా మరియు ప్రీపెయిడ్ కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఎయిర్ టెల్ కూడా కొత్త కొత్త ఆఫర్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ థాంక్స్ ఆఫర్ క్రింద అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్ కంటెంట్ వంటి ఎన్నో ఆఫర్స్ ను అందిస్తుంది. ఇప్పుడు తాజాగా 3ప్రీపెయిడ్ ప్లన్స్ కు 400ఎంబీ ఉచిత అదనపు డేటా ను అందిస్తుంది.

టెలికాం టాక్ నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం ఎయిర్ టెల్ 399/-,448/- మరియు 499/- ప్లాన్స్ కు 400ఎంబీ ఉచిత అదనపు డేటా ను అందిస్తుంది. అయితే ఈ సమాచారం ఇంకా ఎయిర్ టెల్ వెబ్ మరియు అప్ ల్లో అప్డేట్ చేయవలిసివుంది.

399/-ప్లాన్ 84రోజుల వాలిడిటీ తో రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది ఇప్పుడు ఈ ఆఫర్ లో భాగంగా రోజుకు 1.4జీబీ డేటా లభించనున్నది. అలాగే 448/-ప్లాన్ 82రోజుల వాలిడిటీ తో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది ఇప్పుడు ఈ ఆఫర్ లో భాగంగా రోజుకు 1.9జీబీ డేటా లభించనున్నది. చివరగా 499/-ప్లాన్ 82రోజుల వాలిడిటీ తో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది ఇప్పుడు ఈ ఆఫర్ లో భాగంగా రోజుకు 2.4జీబీ డేటా లభించనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here