గీక్ బెంచ్ లో కనిపించిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్

0

క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 855 కి సక్సెసోర్ అంటే 865 కి లీక్స్ మరియు రుమోర్స్ నెట్ హల చల్ చేస్తున్నాయి. సాధారణంగా క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రోసుస్సోర్స్ ను డిసెంబర్ లో ప్రకటిస్తుంది.

తాజాగా 865ప్రాసెసర్ రెండు వెర్షన్ లో రానున్నది. ఒకటి X55 5జి మోడెమ్ కలిగినది , రెండోవది నార్మల్ ప్రాసెసర్. 5జి మోడెమ్ కలిగిన దాని కోడ్ నేమ్ కోనా(KONA) మరియు నార్మల్ ప్రాసెసర్ కోడ్ నేమ్ హురా కాన్(HURACAN) గా తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్టుగా 5జి మోడెమ్ కలిగిన ప్రాసెసర్ గీక్ బెంచ్ లో మెరిసింది. ఈ ప్రాసెసర్ సింగల్ కోర్ లో 4160 స్కోర్ చేసింది. ఈ స్కోర్ ఆపిల్ బియోనిక్ A12 చిప్ స్కోర్ మరియు లేటెస్ట్ సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9825 ప్రాసెసర్ సింగల్ కోర్ స్కోర్స్ కన్నా తక్కువ.

అయితే మల్టీ కోర్ లో మాత్రం 9825 మరియు A12 ప్రాసెసర్ కన్నా చాలా మెరుగుగ్గా స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ మల్టీ కోర్ లో 12946 స్కోర్ చేసింది. ఈ ప్రాసెసర్ UFS 3.0 మరియు LPDDR5X రామ్ లను సపోర్ట్ చేస్తుంది. అన్ని సజావుగా జరిగితే ఈ ప్రాసెసర్ ను సామ్ సుంగ్ గాలక్సీ S11 మొబైల్స్ లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here