గీక్ బెంచ్ లో మెరిసిన నోకియా 7.2

0

నోకియా కంపెనీ 7.1 సక్సెసోర్ 7.2 ను త్వరలోనే విడుదల చేయనున్నది.మొదటి సారి గా నోకియా బార్సిలోనా లో జరుగనున్నసెప్టెంబర్ 6న IFA 2019 లో పాల్గొనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్స్ నెట్ హల చల్ చేస్తున్నాయి. ఈ ఈవెంట్ లో నోకియా కంపెనీ 7.2 మరియు 6.2 మొబైల్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

ఇంకా నోకియా గీక్ బెంచ్ లో సింగల్ కోర్ లో 1604 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 5821 స్కోర్ చేసింది. ఈ స్కోర్స్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ కలిగిన ఫోన్స్ స్కోర్స్ కి దరిదాపుల్లో వున్నాయి. అయితే నోకియా 7.2 లో ఈ ప్రాసెసర్ అనేది ఇప్పటివరకు తెలియలేదు. ఈ ఫోన్ యొక్క కోడ్ నేమ్ గీక్ బెంచ్ ప్రకారం డేర్ డెవిల్ అని తెలుస్తుంది.

ఇంకా ఫోన్ స్పెసిఫికేషన్స్ గీక్ బెంచ్ ప్రకారం ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 9.0 తో రానున్నది. అలాగే లీక్స్ ప్రకారం ఈ మొబైల్ సర్కులర్ డిజైన్ తో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో రానున్నట్లు తెలుస్తుంది. దీనిలో మెయిన్ కెమెరా 48ఎంపీ అని తెలుస్తుంది. అంతే కాకుండా 6.2ఇంచ్ ఫుల్ HD+ నాచ్ డిజైన్ తో మరియు 3500mAh బ్యాటరీ ను కలిగి ఉన్నట్లు రుమోర్స్ వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here