జియో గిగా ఫైబర్ 600రూపాయల ప్లాన్ తో బ్రాడ్ బ్యాండ్ మరియు డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి షాక్ ఇవ్వనున్న జియో

0
1708

మొబైల్ నెట్ వర్క్ ప్రపంచం లో జియో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికి తెలుసు. క్రితం సంవత్సరం లో జియో గిగా ఫైబర్ అధికారకంగా ప్రకటించబడింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జియో గిగా ఫైబర్ ను టెస్ట్ చేస్తున్నారు. మరికొద్ది నెలలో అన్ని ముఖ్యమైన సిటీలో జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

వస్తున్నా సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ లో ప్రారంభపు ప్లాన్ 600రూపాయలతో అవుతుంది అని తెలుస్తుంది. ఈ ప్లాన్ ను ట్రిపుల్ ప్లాన్ గా చెపుకోవచ్చు. అంటే ఒకే ప్లాన్లో బ్రాడ్ బ్యాండ్, టీవీ కేబుల్ అలాగే ల్యాండ్ ఫోన్ సర్వీస్ అందించబడతాయి.దీని కోసం మొదట జియో గిగా ఫైబర్ వన్ టైమ్ డిపాజిట్ కింద 4500/-లను తీసుకుంటుంది. ఈ 4500/-లు రూటర్ ను యూజర్స్ కి అందించడానికి కోసం ఉపయోగించబడతాయి. అంతే కాకుండా ఈ 600రూపాయల ప్లాన్ లో 100ఎంబీపీస్ స్పీడ్ తో 100జీబీ నెలకు,ఆన్ లిమిటెడ్ ల్యాండ్ లైన్ కాల్స్ మరియు 600+టీవీ కేబుల్ ఛానెల్స్ యూజర్స్ కి అందించబడతాయి. అలాగే 40హోమ్ సర్వీసెస్ అంటే సెక్యూరిటీ కెమెరా మొదలుగున్న వాటికీ కూడా వాడుకోవచ్చు.

ఇదే ప్లాన్ తో కనుక ఇండియా లో విడుదలైతే ఖచ్చితంగా మిగతా కంపెనీస్ కి దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఉదాహరణకు ఒక యూసర్ బ్రాడ్ బ్యాండ్ కోసం నెలకు 600/-, అలాగే కేబుల్ టీవీ కోసం 300రూపాయలు ఖర్చుచేస్తునాడు అని అనుకుంటే నెల మొత్తంమీద దాదాపుగా 1000/-లు ఖర్చుచేస్తున్నట్టే. ఇది ఇండియా లో సామాన్య ప్రజలకు చాలా ఖర్చుతో కూడినది. అందువల్ల జియో గిగా ఫైబర్ కి ఇండియా లో చాలా ఆదరణ రావడానికి అవకాశం వుంది అలాగే ఇప్పటికే చాలా మంది వేచి చుస్తునారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here