టిక్ టాక్ లో ఇండియా నే No.1

0

టిక్ టాక్ లో ఇండియా నే No.1 :  

ఇప్పుడు ఇండియాలో ఎవరినీ చూసిన టిక్ టాక్ తో కాలం గడిపేస్తున్నారు. ముఖ్యముగా యువత , ఇంతకు ముందు అందరూ ఫేస్ బుక్ లో ఉండేవారు. ఇప్పుడు అందరూ టిక్ టాక్ లో ఉంటున్నారు. ఇలా చాలా మంది ఇప్పటికే టిక్ టాక్ కి బాగా addict ( బానిస ) అయ్యారు. 

టిక్ టాక్ డౌన్లోడ్స్  ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు చేరుకున్నాయి. టిక్ టాక్ డౌన్లోడ్ విషయం లో ఇండియా ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానం లో ఉంది. ఇప్పుడు దాదాపు ఇండియాలో టిక్ టాక్ డౌన్లోడ్స్ 47 కోట్లు  దాటాయి. ఇండియా తరువాత చైనా రొండవ స్థానం లో ఉంది. ఇంకా మూడవ స్థానంలో అమెరికా ఉంది.

భవిష్యత్ లో ఇంకా ఇండియాలో టిక్ టాక్ కి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా ఉన్న యువతులు టిక్ టాక్ బాట పట్టారు. టిక్ టాక్ లో చాలా మంది వాళ్ళ టాలెంట్ ని నిరూపించు కోవాలని అనుకుంటున్నారు. టిక్ టాక్ కి పెరుగుతున్న ఆదరణ చూసి ఫేస్ బుక్  కూడా ఇలాంటి ఒక యాప్ ని develop చేసే పనిలో పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here