డైమండ్ కట్ డిజైన్ తో 19990/- రూపాయలకు విడుదలైన వివో S1 ప్రో

0

ఇండియా లో వివో కంపెనీ S1 విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు వివో కంపెనీ దాని సక్సెసోర్ S1 ప్రో ను ఇండియా లో 19990/- రూపాయలకు విడుదల చేసింది. వివో కంపెనీ ఈ మొబైల్ ను 4వ తేదీ న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే . కానీ అనుకున్న తేదీ కన్నా ముందే అంటే 3న విడుదల చేసింది.

ఇంకా మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 6.38ఇంచ్ ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఈ మొబైల్ స్పెషలిటీ ఏంటంటే బ్యాక్ డైమండ్ డిజైన్ తో కూడిన క్వాడ్ కెమెరా సెట్ అప్. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో మెయిన్ కెమెరా 48ఎంపీ +8ఎంపీ వైడ్ అంగెల్ +2ఎంపీ మాక్రో +2ఎంపీ డెప్త్ సెన్సార్ తో కూడిన కెమెరా లు ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ 32ఎంపీ కెమెరా వాటర్ డ్రాప్ డిజైన్ తో వస్తుంది. ఈ 8జీబీ రామ్ మరియు 128జీబీ స్టోరేజ్ లో లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ 4500mAh బ్యాటరీ మరియు 18W డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ తో లభిస్తుంది. ఈ మొబైల్ వివో కంపెనీ చెప్పినట్లుగా ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో డిసెంబర్ 4నుండి లభిస్తుంది. ఈ మొబైల్ మిస్టిక్ బ్లాక్ ,జాజి బ్లూ మరియు డ్రిమీ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

వివో S1 ప్రో స్పెసిఫికేషన్స్:
1. 6.38ఇంచ్ ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో 19.5:9 యాస్పెక్ట్ రేషియో తో
2. స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు అడ్రెనో 610 GPU తో
3. 48ఎంపీ +8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ డైమండ్ డిజైన్ క్వాడ్ కెమెరా సెటప్
4. ఫ్రంట్ 32ఎంపీ వాటర్ డ్రాప్ డిజైన్ లో
5. 8జీబీ రామ్ మరియు 128జీబీ స్టోరేజ్ మరియు 256జీబీ వరకు ఎక్సపండబుల్
6.ఆండ్రాయిడ్ 9.0 ఫన్ టచ్ ఓస్ 9.2 తో
7.4500mAh బ్యాటరీ మరియు 18W డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ తో
8. బ్లూ టూత్ 5, టైపు సి పోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో

లాంచింగ్ ఆఫర్స్:
1. ఐసీఐసీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు లపై 10%కాష్ బ్యాక్
2. 9నెలల వరకు నో కాస్ట్ EMI
3. జనవరి 31 వన్ టైం స్క్రీన్ రిప్లేసెమెంట్(ఆన్ లైన్ కొన్నవారికి మాత్రమే)
4.12000/- రూపాయల విలువైన జియో ఆఫర్స్ (ఆన్ లైన్ కొన్నవారికి మాత్రమే)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here