నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపడం ఎలా ….?

1

చాలా మందికి చాలా సందర్భాల్లో నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ లో చాట్ చేయాలిసివస్తుంది కానీ మనం తప్పనిసరిగా నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాతనే చాట్ చేస్తాం. ఎందుకంటే సేవ్ చేసుకోకపోతే వాట్సాప్ లో చాటింగ్ చేయలేము. కానీ నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం.

 

1.wa.me లింక్ ద్వారా

https://wa.me/phonenumber అనే లింక్ ఉపయోగించి మనకి కావలిసిన నెంబర్ ను సేవ్ చేసుకోకుండా చాటింగ్ చేయవచ్చు. అయితే ఫోన్ నెంబర్ +,-,00,() వంటివి లేకుండా పూర్తి నెంబర్ ను లింక్ లో ఉపయోగించాలి. దీనికి సంబంధించి వాట్సాప్ FAQ లో వివరించబడింది. ఉదాహరణకు మన ఇండియా నెంబర్ +911234567890 అనుకుంటే లింక్ లో https://wa.me/911234567890 అని వెబ్ బ్రౌజర్ లో టైపు చేసి చాట్ చేయవచ్చు.

2. అప్స్ ద్వారా

ప్లే స్టోర్ లో ఈ పని కోసం చాలా అప్స్ అందుబాటులో వున్నాయి. చాలా వరకు అప్స్ లో మనకు కావలిసిన నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా చాట్ చేయవచ్చు. క్లిక్ టూ చాట్ , డైరెక్ట్ మెసేజ్ ఫర్ వాట్సాప్, ఈజీ మెసేజ్ అనే ఈ మూడు అప్స్ చాలా తక్కువ యాడ్స్ ను కలిగి వుండి యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటాయి.

3.టెక్స్ట్ సెలక్షన్ మరియు అప్ యక్షన్స్

సాధారణంగా మనం ఏదైనా టెక్స్ట్ ను సెలెక్ట్ చేసినట్లైతే మనకు కాపీ , పేస్ట్ ,షేర్ , సెలెక్ట్ అల్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటితోపాటు పక్కన వచ్చే … 3డాట్స్ ను సెలెక్ట్ చేసుకంటే దానిలో మనకు అప్ యాక్షన్స్ కనిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫై మరియు Q లో మాత్రమే అది కూడా పిక్సెల్, ఆండ్రాయిడ్ వన్ డేవిస్ లకు మాత్రమే అందుబాటులో వుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here