ఫొటోస్ కోసం “గాలరీ గో” లైట్ వెయిట్ అప్ ను విడుదల గూగుల్

0

సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో ఫొటోస్ కోసం మనం గూగుల్ ఫొటోస్ అనే అప్ వాడుతుంటాం. 2015 నుండి గూగుల్ ఫొటోస్ అందరికి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ అప్ కి చాలా స్టోరేజ్ మరియు నెట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఎప్పుడు వీటికి భిన్నంగా గూగుల్ “గాలరీ గో” అనే లైట్ వెయిట్ అప్ ను విడుదల చేసింది.

నైజిరియా లో జరిగిన “గూగుల్ ఫర్ నైజిరియా ” మూడోవ వార్షికోత్సవం లో ఈ అప్ ను విడుదల చేసింది గూగుల్. ఈ అప్ గూగుల్ ఫొటోస్ మాదిరిగానే పనిచేస్తుంది అంటే ఫొటోస్ ను ఒక క్రమంలో అమర్చడం అలాగే ఫొటోస్ ను మరింత షార్ప్ చేసుకోవడం , ఎడిట్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో వున్నాయి. ఈ అప్ ఎవరికైతే నెట్ కనెక్టివిటీ సరిగా ఉండదో వారి కోసం ఈ అప్ ను విడుదల చేసినట్లు గూగుల్ చెప్తుంది. అలాగే ఈ అప్ మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ ఆఫ్ లైన్ కూడా పనిచేస్తుంది.

ఈ అప్ గూగుల్ ఫొటోస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ సైజు అంటే కేవలం 10ఎంబీ సైజు మాత్రమే కలిగి వుంది. “గాలరీ గో” అప్ ఆండ్రాయిడ్ 8.1 మరియు అంత కన్నా ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే పనిచేస్తుంది. ఈ అప్ ఇప్పటికే ప్లే స్టోర్ లో లభిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here