బిఐఎస్(BIS) సర్టిఫికేషన్ పొందిన రెడీమిK30 మొబైల్

0

కొద్దీ కాలంగా మొబైల్ ప్రపంచంలో ఎక్కడ చుసిన రెడీమిK30 మొబైల్ గురుంచే మాట్లాడుకుంటున్నారు. ఈ మొబైల్ ను మొదట చైనా లో డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. గ్లోబల్ గా ఎప్పుడు విడుదల చేయనున్నారో ఇంకా తెలియలిసి ఉంది. ఈ మొబైల్ ను ప్రస్తుతానికి చైనా లో రెండు వేరియంట్ లో అంటే 4జి మరియు 5జి లో విడుదల చేయనున్నారు. ఇండియా విషయానికొస్తే ఈ మొబైల్ M1912G7BI అనే మోడల్ నెంబర్ తో బిఐఎస్(BIS) సర్టిఫికేషన్ పొందింది అంటే ఇండియా లో కూడా త్వరలోనే ఈ మొబైల్ విడుదల అవుతుంది.

స్పెసిఫికేషన్ పరంగా చూస్తే క్వాలకం విడుదల చేసినా లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ తో విడుదల అవుతున్న మొబైల్ రెడీమిK30 నే అలాగే సోనీ లేటెస్ట్ కెమెరా సెన్సార్ అయిన IMX686 64ఎంపీ కెమెరా తో వస్తున్నా మొబైల్ కూడా రెడీమిK30 నే.ఈ మొబైల్ మొబైల్ 6.67 ఇంచ్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా తో రానున్నది. బ్యాక్ 64+12+8+2ఎంపీ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 20+2ఎంపీ కూడిన డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా సెటప్ తో రానున్నది. అలాగే 4500mAh బ్యాటరీ తో మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ తో రానున్నది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు టైపు సి పోర్ట్ తో మరియు ఆండ్రాయిడ్ 10 తో కూడిన మియూఐ 11తో రానున్నది. ఇంకా 5జి మోడల్ స్నాప్ డ్రాగన్ 765ప్రాసెసర్ తో మరియు 4జి మొబైల్ స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్ తో రానున్నది. ఈ మొబైల్ ఇండియా లో 4జి మోడల్ మాత్రమే విడుదల అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా లో ఇంకా 5జి అందుబాటులో లేదు కనుక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here