బ్లాక్ శాండ్ స్టోన్ కలర్ లో విడుదలైన 20000mAh మీ పవర్ బ్యాంక్ 2i

0

ఇండియాలో మీ పవర్ బ్యాంక్ 2i చాలా సక్సెసయ్యాయి. ఇప్పుడు మీ కంపెనీ 20000mAh వేరియంట్ లో కొంచెం అప్ గ్రేడెడ్ వెర్షన్ ను విడుదల చేసింది. ఈ అప్ గ్రేడెడ్ పవర్ బ్యాంక్ కూడా పాత పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ ను కలిగి ఉంటుంది కొద్దీ పాటి తేడాతో.

ఈ పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంటుంది. అలాగే రెండు USB పోర్ట్ లను కలిగి ఉంది. ఈ రెండు USB పోర్టులు 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ఫుట్ మరియు ఔట్ ఫుట్ లను సపోర్ట్ చేస్తుంది. కంపెనీ చెపుతున్న దాని ప్రకారం ఈ పవర్ బ్యాంక్ సహాయం తో రెడీమి K20ప్రో , రెడీమి నోట్ 7ప్రో మొబైల్స్ ను 3సార్లు మరియు ఆపిల్ ఐ ఫోన్ 8 ను 7.2 సార్లు ఛార్జ్ చేయవచ్చు అని చెప్తుంది.

ఈ పవర్ బ్యాంక్ బ్లాక్ శాండ్ స్టోన్ కలర్ కలర్ లో లభిస్తుంది. అలాగే ఈ పవర్ బ్యాంక్ రెండు USB పోర్టులు ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తాయి. ఈ రెండే పాత మరియు కొత్త పవర్ బ్యాంక్ కుగలా ముఖ్యమైన తేడాలు. ప్రస్తుతానికి ఈ అప్ గ్రేడెడ్ పవర్ బ్యాంక్ మీ.కామ్ లో మాత్రమే 1499/-రూపాయలకు లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here