మోటో E6 ప్లస్ మొబైల్ లైవ్ ఇమేజెస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి

0

జులై 2019 లో మోటోరోలా కంపనీ సైలెంట్ గా మోటో E6 మొబైల్ ను విడుదల చేసింది.ఇప్పడు మోటో E6 సిరీస్ లో భాగంగా రెండో మొబైల్ అంటే E6ప్లస్ కి సంభందించిన ఇమేజెస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఇమేజెస్ ప్రకారం E6ప్లస్ మొబైల్ E6 మొబైల్ లాగా 18:9 రేషియో తో కాకుండా వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో రానున్నది. అలాగే ఈ సారి E6 సిరీస్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ను తీసుకురానున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు రానున్నది.ఈ ఇమేజెస్ అని అలీ ఎక్సప్రెస్ సైట్ ద్వారా రోలాండ్ క్వాన్ట్ అనే లీక్స్ స్టార్ ట్విట్టర్ ద్వారా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం మోటో E6ప్లస్ గీక్ బెంచ్ లో మెరిసింది. గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ సింగల్ కోర్ లో స్కోర్ చేయగా మల్టీ కోర్ లో స్కోర్ చేసింది. గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసర్ తో మరియు ఆండ్రాయిడ్ 9.0 తో రానున్నది. విడుదల తేదీ కి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here