లీకైన రెడీమి నోట్ 7ప్రో స్పెసిఫికేషన్స్

0

రెడీమి అభిమానులకు శుభవార్త. ప్రఖ్యాత చైనా మొబైల్ కంపెనీ షియోమీ రెడీమి నోట్ 7 కొత్త ఫోన్ ను ఫిబ్రవరి 28 న ఇండియా లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రెడీమి అభిమానులు ఎదురుచూస్తున్న రెడీమి నోట్ 7 ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ య్యాయి. ఈ ఫోన్ రీసెంట్ గా చైనా లో 3సి సర్టిఫికేషన్ పొందింది. దీని ప్రకారం నోట్ 7 ప్రో M1901F7BE అనే మోడల్ నెంబర్ తో సర్టిఫికేషన్ పొందింది. ఈ మోడల్ నెంబర్ రెడీమి నోట్ 7మోడల్ నెంబర్ కు సిమిలర్ గా వుంది.
ముఖ్యమైన ఫీచర్స్ ఏంటిఅంటే లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 675(11nm) ప్రాసెసర్ అలాగే 48 MP సోనీ IMX 586 సెన్సార్ మరియు 18W ఫాస్ట్ చార్జర్ తో రానున్నట్టు ఈ 3సి సర్టిఫికేషన్ అలాగే లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రెడీమి నోట్ 7 లాంచ్ టైం లో నోట్ 7ప్రో 48 MP సోనీ IMX 586 సెన్సార్ తో రానున్నట్లు ప్రకటించింది.

వస్తున్నా రుమోర్స్ ప్రకారం షియోమీ చైనా రెడీమి నోట్ 7ప్రో స్పెసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా వున్నాయి.
1 . 6.43-inch Full HD+ (2340 ×1080 pixels ) డిస్ప్లే వాటర్ డ్రాప్  డిజైన్ తో మరియు కార్నింగ్ గొరిల్లా ప్రొటెక్షన్ తో
2 . స్నాప్ డ్రాగన్ 675(11nm) ప్రాసెసర్ తో
3 .4/6 జీబీ LPDDR4xరామ్ మరియు 64/128జీబీ మెమరీ తో
4.బ్యాక్ కెమెరా : ప్రైమరీ కెమెరా 48 MP సోనీ IMX 586 సెన్సార్ (f/1.8) సెకండరీ కెమెరా 5MP
5.ఫ్రంట్ కెమెరా : 13 MP
6. 4000 mAh బ్యాటరీ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ మరియు USB టైపు సి పోర్ట్ మరియు 18W ఫాస్ట్ చార్జర్ తో
7. ఆండ్రాయిడ్ 9.0 MIUI 10 తో
8. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IR సెన్సార్

ఈ ఫోన్ ఏఏ కలర్స్ లో రానున్నది అలాగే ఈ ఫోన్ ధర ఎంత ఉండవచ్చు అనేది తెలియలిసివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here