లీకైన రెడీమి నోట్ 8 సిరీస్ మొబైల్ స్పెసిఫికేషన్స్

0

ఇండియా లో రెడీమి నోట్ సిరీస్ మొబైల్స్ చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన రెడీమి నోట్ 7 మరియు ప్రో మొబైల్స్ కూడా సక్సెసయ్యాయి. ఇప్పుడు వీటి సక్సెసోర్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే మొదటగా ఈ మొబైల్స్ ను చైనా విడుదల చేయనున్నారు. ఇప్పటికీ ఆగష్టు 29న రెడీమి టీవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించిందే. ఇప్పుడు టీవీ తో పాటు రెడీమి నోట్ 8 సిరీస్ మొబైల్స్ ను కూడా విడుదల చేయనున్నది.

ఇంకా స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన లీక్స్ కూడా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. రెడీమి సీఈఓ మను కుమార్ జైన్ చెప్పినట్లుగా రెడీమి నోట్ 8 సిరీస్ మొబైల్ మీడియా టెక్ హీలియో జి90 సిరీస్ ప్రాసెసర్ లతో రానున్నాయి. రెండు మొబైల్స్ కూడా 18వ ఫాస్ట్ ఛార్జింగ్ తో రానున్నాయి. అలాగే ప్రో మోడల్ మొబైల్ 64ఎంపీ మరియు 3డి కెమెరా తో కూడిన క్వాడ్ కెమెరా తో సెటప్ తో రానున్నది. ఇంకా బ్యాటరీ కూడా 4000mAh కెపాసిటీ కి దరిదాపుల్లో మరియు టైపు సి పోర్ట్ తో రానున్నాయి.

లీకెడ్ నోట్ 8సిరీస్ స్పెసిఫికేషన్స్:
1.6.39ఇంచ్ ఫుల్ HD+ వాటర్ డ్రాప్ డిస్ప్లే
2.మీడియా టెక్ హీలియో జి90సిరీస్ ప్రాసెసర్
3.18W ఫాస్ట్ ఛార్జింగ్
4.ప్రో మోడల్ క్వాడ్ కెమెరా సెటప్
నార్మల్ మోడల్ ట్రిపుల్ కెమెరా సెటప్
5.టైపు సి పోర్ట్
రెడీమి కంపెనీ ఈ మొబైల్స్ ను ఇండియా లో అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. చూడాలి రెడీమి కంపెనీ ఇండియా లో ఈ మొబైల్స్ ను ఎప్పుడు విడుదల చేస్తుందో……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here