లీకైన సామ్ సుంగ్ గాలక్సీ A71 రెండర్ ఇమేజెస్

0

ఇండియా లో సామ్ సుంగ్ 2019లో విడుదలైన A సిరీస్ మొబైల్స్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఆ సిరీస్ లో A70 మొబైల్ సక్సెసోర్ A71 మొబైల్ ను సామ్ సుంగ్ త్వరలోనే విడుదల చేయనున్నది. ఈ మొబైల్ కి సంబంధించిన రెండర్ ఇమేజెస్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ రెండర్ ఇమేజెస్ ప్రకారం ఈ మొబైల్ 6.7ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే మరియు ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా తో రానున్నది. బ్యాక్ L షేప్ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ తో రానున్నది. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో 48ఎంపీ మెయిన్ +12ఎంపీ వైడ్ అంగెల్ +12ఎంపీ టెలి ఫోటో +TOF లను కలిగి ఉండవచ్చు. కొన్ని రోజుల క్రితం ఈ మొబైల్ గీక్ బెంచ్ లో మెరిసింది. గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ సింగల్ కోర్ లో 2540 స్కోర్ చేసింది అలాగే మల్టీ కోర్ లో 7081 స్కోర్ చేసింది.

గీక్ బెంచ్ ప్రకారం A71 ఆండ్రాయిడ్ 10 వన్ UI2.0 మీద పని చేస్తుంది. అలాగే గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తుంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సామ్ సుంగ్ లేటెస్ట్ ప్రాసెసర్ ఎక్సీనోస్ 980 తో కూడా రావచ్చుఅని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here