వాటర్ ఫాల్ డిజైన్ తో విడుదలైన వివో నెక్స్3

0

వివో కంపెనీ ఫ్లాగ్ షిప్ మొబైల్ అయినా నెక్స్ సిరీస్ లో లేటెస్ట్ మొబైల్ ను చైనా లో విడుదల చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్స్ అంటే 4జి మరియు 5జి మోడల్స్ లో విడుదల చేసారు. మొబైల్ ప్రపంచం లో 90డిగ్రీ వాటర్ ఫాల్ డిజైన్ తో వస్తున్నా మొట్ట మొదటి మొబైల్ వివో నెక్స్3. ఈ మొబైల్ సెప్టెంబర్ 21నుండి చైనా లో సేల్ కి రానున్నది. వివో కంపెనీ చెప్తున్నా దాని ప్రకారం త్వరలోనే ఆసియా పసిఫిక్ మరియు తూర్పు ఆసియా దేశాలకు తీసుకురానున్నారు.

ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే వివో నెక్స్3 లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 855ప్లస్ ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU తో వస్తుంది.6.89ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్ మరియు HDR10 సపోర్ట్ తో మరియు 99.6% ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే బటన్ లెస్ మొబైల్ అంటే సైడ్ ప్రెషర్ కీస్ ద్వారా మొబైల్ ను వాడవచ్చు. అలాగే ఈ మొబైల్ బ్యాక్ ట్రిపుల్ కెమెరా అంటే 64ఎంపీ+13ఎంపీ+13ఎంపీ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 16ఎంపీ పాప్ అప్ కెమెరా ను కలిగి వుంది. అంతే కాకుండా ఈ మొబైల్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.

వివో నెక్స్3 స్పెసిఫికేషన్స్:

1.స్నాప్ డ్రాగన్ 855ప్లస్ ప్రాసెసర్ మరియు అడ్రెనో 640GPU
2.6.89ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్ మరియు HDR10
3.8/12జీబీ రామ్ మరియు 128/256/512జీబీ స్టోరేజ్
4.64ఎంపీ+13ఎంపీ+13ఎంపీ బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్
5.16ఎంపీ ఫ్రంట్ పాప్ అప్ కెమెరా
6.ఆండ్రాయిడ్ 9.0 మరియు ఫన్ టచ్ ఓస్ 9.1
7.4410mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్
8.ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,3.5MM హెడ్ ఫోన్ జాక్

ఈ మొబైల్ వైట్ మరియు బ్లాక్ కలర్స్ లో రానున్నది. వివో నెక్స్3 4జి మోడల్ బేస్ వేరియంట్ ధర 4998 యువాన్(దాదాపు 50,633/-రూపాయలు) అలాగే 5జి మోడల్ బేస్ వేరియంట్ ధర 5698యువాన్ (దాదాపు 57,725/-రూపాయలు)గా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here