వాట్సాప్ స్టేటస్ లను సేవ్ లేదా డౌన్లోడ్ చేయడం ఎలా ……?

0

ప్రస్తుత ప్రపంచం లో సోషల్ మీడియా వాట్సాప్ ది ప్రత్యకమైన స్థానం. మనం ఏ విషయానైనా చాలా త్వరగా వాట్సాప్ ద్వారా పంచుకుంటాము. చాలా మంది ఫ్రెండ్స్ తమ ఫీలింగ్స్ ను వాట్సాప్ లోని స్టేటస్ ద్వారా షేర్ చేసుకుంటారు.

చాలా మందికి ఆ స్టేటస్ లో నిఫోటొస్ లేదా వీడియోస్ ను సేవ్ చేసుకోవాలిఅనుకుంటారు. కానీ అవి ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు. అయితే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ముందుగా మనం గూగుల్ ఫైల్స్ అనే అప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ ట్రిక్ ను అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్ స్టేటస్ లను సేవ్ లేదా డౌన్లోడ్ చేయడం  
1.మొదటగా గూగుల్ ఫైల్స్ అప్ హోమ్ స్క్రీన్ లో ఎడమ వైపు పైభాగం లో 3గీతలను సెలెక్ట్ చేసుకోవాలి
2.ఇప్పడు సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి
3.సెట్టింగ్స్ లో షో హిడెన్ ఫైల్స్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి
4.మళ్ళి హోమ్ స్క్రీన్ లో బ్రౌజ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి
5.ఇప్పడు ఇంటర్నల్ స్టోరేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి
6.ఇంటర్నల్ స్టోరేజ్ లో వాట్సాప్ ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకోవాలి
7.ఇప్పడు వాట్సాప్ ఫోల్డర్ లో మీడియా అనే ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకోవాలి
8.మీడియా ఫోల్డర్ లో స్టేటస్ అనే ఫోల్డర్ లో మనం చుసిన స్టేటస్ కి సంబంధించిన మీడియా అంత కనిపిస్తుంది.
9.ఇప్పుడు మనకి కలిసిన ఫోటో లేదా వీడియో ను సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుకుని మనకు నచ్చిన ఫోల్డర్ పేస్ట్ చేసుకోవడం ద్వారా సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్టేటస్ వీడియో లేదా ఫొటోస్ కేవలం 24గంటలపాటు మాత్రమే ఉంటాయి అదికూడా షేర్ చేసుకున్న టైమ్ నుంచి 24గంటలు మాత్రమే . ఇంకాఎందుకు ఆలస్యం త్వరగా మనకు నచ్చిన ఫోట్స్ లేదా వీడియోస్ సేవ్ చేసుకుని ఆనందించండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here