విడుదలైన సామ్ సుంగ్ గాలక్సీ A50s

0

2019సంవత్సరంలో సామ్ సుంగ్ కంపెనీ విడుదల చేసిన గాలక్సీ “A” సిరీస్ మొబైల్స్ లో అత్యంత పాపులర్ మరియు సేల్స్ కలిగిన మొబైల్ A50. ఇప్పుడు సామ్ సుంగ్ కొద్దిపాటి మార్పులతో A50s అనే పేరుతో A50 మొబైల్ ను రీలాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఈ మొబైల్ A50 లానే ఉంటుంది.

సుంగ్ గాలక్సీ A50s మొబైల్ A50లో వాడిన అదే సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9610ప్రాసెసర్ తో వస్తుంది.ఈ రెండు మొబైల్స్ లోముఖ్యమైన తేడా లేదా కొత్త మార్పులు కెమెరా విభాగం లో జరిగాయి. కొత్త సామ్ సుంగ్ గాలక్సీ A50s మెయిన్ కెమెరా 48ఎంపీ తో వస్తుంది మిగిలిన రెండు కెమెరా లు సామ్ సుంగ్ గాలక్సీ A50 లో వాడిన 5ఎంపీ డెప్త్ కెమెరా అలాగే 8ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా పాత 25ఎంపీ కెమెరా నుండి 32ఎంపీ కు మార్చబడింది. మిగిలిన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ పాత A50లోని విధంగానే కొత్త A50s లో కూడా ఉంటాయి.

సామ్ సుంగ్ గాలక్సీ A50s స్పెసిఫికేషన్స్:
1.సామ్ సుంగ్ ఎక్సీనోస్ 9610(10nm) ప్రాసెసర్ తో
2.6.4ఇంచ్ ఫుల్ HD+ ఇన్ఫినిటీ U నాచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తో
3.బ్యాక్ 48ఎంపీప్రైమరీ కెమెరా +8ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్ +5ఎంపీ డెప్త్ కెమెరా
4.ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
5.4/6జీబీ రామ్ మరియు 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 512జీబీ వరకు ఎక్సపండబుల్
6.ఆండ్రాయిడ్ 9.0 సామ్ సుంగ్ వన్ UI
7.4000mAh బ్యాటరీ, టైపు సి ,15W ఫాస్ట్ ఛార్జింగ్ తో
8.ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రిమియంట్ సెన్సార్

ఈ మొబైల్ ప్రిజం క్రష్ బ్లాక్,ప్రిజం క్రష్ వైట్,ప్రిజం క్రష్ గ్రీన్,ప్రిజం క్రష్ వైలెట్ కలర్స్ లో లభిస్తుంది. అయితే ఈ మొబైల్ ఎప్పటినుండి లభిస్తుందో అలాగే ధర కి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని సామ్ సుంగ్ అధికారకంగా ప్రకటించలేదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here