షియోమీ కొత్త మీయూఐ(MIUI) 11 ఫీచర్స్

0

షియోమీ అక్టోబర్ 16న కొత్త UI అంటే MIUI11 ను విడుదల చేసింది. అలాగే ఏ ఏ ఫోన్స్ కు ఎప్పుడుడెపుడు రానున్నదో కూడా ప్రకటించింది. ఇప్పుడు MIUI11 లోని కొన్ని కొత్త ఫీచర్స్ చూద్దాం.

1. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే : షియోమీ MIUI11 లో తీసుకొచ్చిన ముఖ్యమైనా ఫీచర్స్ ఒకటి. దీని లో క్లాక్ తోపాటు నోటిఫికెషన్స్ వంటి వాటిని చూడవచ్చు. అలాగే దీనిలో లభించే ఫీచర్స్ తో మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.

2. డైనమిక్ వీడియో వాల్ పేపర్: ఇప్పటి వరకు మనకు నచ్చిన లేదా మియూయి  లభించే వాటిని మాత్రమే వాల్ పేపర్ పెటుకోవచ్చు. ఇప్పడు ఈ కొత్త ఫీచర్ మనకు నచ్చిన వీడియో ను వాల్ పేపర్ గా కూడా పెట్టుకోవచ్చు.

3. థంబ్ నైల్ ఫీచర్ : ఈ ఫీచర్ ద్వారా ఫైల్ మేనేజర్ లో ని డాకుమెంట్స్ ను సిస్టం లోకి మల్లె థంబ్ నైల్ లో చూడవచ్చు. దీని ద్వారా మనకు కావలిసిన డాక్యుమెంట్ త్వరగా వాడుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్ వ్యూ కోసం షియోమీ WPS తో జత కట్టింది. దీని సహాయం తో థర్డ్ పార్టీ అప్స్ సహాయం లేకుండానే డాకుమెంట్స్ ను చూడవచ్చు.

 

4.టూడూ లిస్ట్  మరియు ఫ్లోటింగ్ కాలిక్యులేటర్: ఈ ఫీచర్ లో ఏ రోజు ఏ పని చేయాలి అనుకునుటున్నామో సెట్ చేసుకోవచ్చు అలాగే ఆ పని క్యాలెండరు తో సింక్ అవుతుంది,అంతే కాకుండా టూ డూ లో పని చేస్తున్నపుడు కాలిక్యులేటర్ ను ఫ్లోటింగ్ కాలిక్యులేటర్ ఫీచర్ తో వాడుకోవచ్చు.

5.ఉమెన్స్ హెల్త్ : ఈ ఫీచర్ తో లేడీస్ వాళ్ళ ఋతు చక్రాన్ని క్యాలెండరు అప్ లో సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇండియా , ఇండోనేషియా మరియు స్పెయిన్ దేశాల్లో మాత్రమే లభిస్తుంది.

6.గేమింగ్ టూల్ బాక్స్ : ఈ ఫీచర్ ద్వారా డేటా నెట్ వర్క్ మారడం అలాగే నోటికేషన్స్ , కాల్స్ ను బ్లాక్ చేయడం, గేమ్ ను వీడియో రికార్డు చెయ్యడం వంటి మరెన్నో ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఇవే కాకుండా మింట్ కి బోర్డ్ ,నాచురల్ సౌండ్ , నేచర్ అలారం ,మీ షేర్ ,వైర్ లెస్ ప్రింట్ , డ్యూయల్ క్లాక్ వంటి మరెన్నో ఫీచర్స్ రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here