స్నాప్ డ్రాగన్ 665 మరియు క్వాడ్ కెమెరా లతో రానున్న రెడీమి నోట్ 8

0
637

గత కొన్ని రోజులగా నెట్ లో మొబైల్స్ విభాగం లో ఎక్కడ చూసినా రెడీమి నోట్ 8సిరీస్ మొబైల్స్ గురుంచే. రీసెంట్ గా రెడీమి నోట్ 8ప్రో కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రకటించబడ్డాయి. ఇప్పడు రెడీమి నోట్ 8 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ WEIBO ద్వారా ప్రకటించబడ్డాయి

WEIBO నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 655ప్రాసెసర్ తో రానున్నది. తక్కువ పవర్ మరియు ఎక్కువ IQ (“lower power consumption and higher IQ”) అనే టాగ్ లైన్ తో పోస్టర్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అలాగే నోట్8 క్వాడ్ కెమెరా సెటప్ తో రానున్నది. ఈ సెటప్ లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా కాగా మిగిలిన మూడు కెమెరా లో అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా, డెప్త్ కెమెరా , సూపర్ మాక్రో కెమెరా అని సమాచారం వస్తుంది.

ప్రస్తుతం నోట్8 కెమెరా తో తీసిన ఫొటోస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.క్వాడ్ కెమెరా సెటప్ వెర్టికాల్ గా మరియు దాని అనుకుని డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ఉన్నాయి. ఇంకా లీక్స్ ప్రకారం ఈ మొబైల్ బ్లూ వైట్ గ్రేడియంట్ కలర్ లో రానున్నది. రెడీమి నోట్ 8 సిరీస్ మొబైల్ ఆగష్టు 29న చైనా లో జరగబోయే రెడీమి టీవీ తో పాటు విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here