స్నాప్ డ్రాగన్ 712ప్రాసెసర్ తో విడుదలైన వివో Z5

0

వివో కంపెనీ చైనా లో స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ తో ఒక మొబైల్ ను అంటే వివో Z5 మొబైల్ ను విడుదల చేసింది. రీసెంట్ గా వివో ఇండియా లో ఇదే ప్రాసెసర్ తో వివో Z1 ప్రో అనే మొబైల్ ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసందే. వస్తున్నా సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఇండియా లో కూడా విడుదల కావచ్చు.

ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ పరంగా చుస్తే లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ అడ్రెనో 616 GPU తో వస్తుంది. అలాగే వాటర్ డ్రాప్ నాచ్ తో 6.38 ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్యాక్ 48ఎంపీ మెయిన్ కెమెరా ,8ఎంపీ అల్ట్రా వైడ్ అంగెల్ కెమెరా మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 32ఎంపీ కెమెరా తెజో వస్తుంది. ఈ మొబైల్ 4500mAh బాటరీ కెపాసిటీ తో మరియు 22.5W ఫాస్ట్ చార్జర్ తో లభిస్తుంది. కంపెనీ చెపుతున్నదాని ప్రకారం 50%ఛార్జింగ్ ను కేవలం 30నిమిషాల్లో అవుతుంది అని చెపుతున్నారు.

వివో Z5 స్పెసిఫికేషన్స్ :
1.స్నాప్ డ్రాగన్ 712(10nm) ప్రాసెసర్ అడ్రెనో 616 GPU
2.6.38 ఇంచ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే
3.6/8జీబీ రామ్ మరియు 64/128/256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో
4.బ్యాక్ 48ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్
5.ఫ్రంట్ 32ఎంపీ కెమెరా
6.ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు టైపు సి పోర్ట్ తో
7.ఆండ్రాయిడ్ 9.0 మరియు ఫన్ టచ్ ఓస్ 9.1 తో
8.4500mAh బాటరీ కెపాసిటీ తో మరియు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ తో
ఈ మొబైల్ బ్లాక్,బ్లూ,అరోరా బ్లూ కలర్స్ లో లభిస్తుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర 1598యువాన్(US $232/ 15975/-రూపాయలు దాదాపుగా) మరియు హై ఎండ్ వేరియంట్ ధర 2298యువాన్ (US $333/22970/-రూపాయలు దాదాపుగా )వుంది. ఈ మొబైల్ చైనా లో ఆగష్టు 6నుండి సేల్ కి రానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here