స్నాప్ డ్రాగన్ 865 మరియు 765సిరీస్ ప్రాసెసర్ లను విడుదల చేసిన క్వాల్కమ్

0

క్వాల్కమ్ కంపెనీ రెండు కొత్త ప్రొసెసర్స్ లను అంటే స్నాప్ డ్రాగన్ 865 మరియు 765సిరీస్ లను ప్రకటించింది. హువాయి వేదిక కాగా జరుగుతున్నా క్వాల్కమ్ టెక్ సమ్మిట్ లో వీటిని ప్రకటించింది. వీటిలో 865 ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్  (855 ప్రాసెసర్ కు సక్సెసోర్ ) మరియు 765సిరీస్ ప్రాసెసర్ అప్పర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్  (స్నాప్ డ్రాగన్ 730సిరీస్ ప్రాసెసర్ కి సక్సెసోర్) ని ప్రకటించారు.

ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం 765ప్రాసెసర్ 765 మరియు 765జి రెండు రకాలుగా మరియు 5జి సపోర్ట్ తో వస్తుంది.

5జి సపోర్ట్ కోసం దీనిలో X52 అనే 5జి మోడెమ్ ను వాడారు. లీక్స్ ప్రకారం షియోమీ డిసెంబర్ నెలలో రెడీమి కే 30 మొబైల్ ను ఈ ప్రాసెసర్ తో తీసుకురావచ్చు అలాగే నోకియా Q1 2020 లో నోకియా కంపెనీ మొదటి 5జి మొబైల్ ను ఈ ప్రాసెసర్ తో తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఇంకా ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 865 ఇప్పటివరకు విడుదలైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లోకెల్లా అత్యంత శక్తివంతమైనది. 2020 మొదటి అర్ధ భాగం లోరానున్న ఫ్లాగ్ షిప్ మరియు ఫ్లాగ్ షిప్ షిప్ కిల్లర్ మొబైల్స్ సామ్ సుంగ్ గాలక్సీ S11, వన్ ప్లస్ 8సిరీస్ మరియు మీ10 మొబైల్స్ స్నాప్ డ్రాగన్ 865ప్రాసెసర్ తో విడుదల కానున్నాయి. ఈ ప్రాసెసర్ X55 5జి మోడెమ్ ను కలిగి వుంది. అలాగే ఈ ప్రాసెసర్ 15TOPS (Tera operations per second) చేయగలదు. ఈ ప్రాసెసర్ 200ఎంపీ కెమెరా వరకు సపోర్ట్ చేయగలదు అంతే కాకుండా 8కే వీడియోస్ ను రికార్డ్ చేయవచ్చు. స్పెసిఫికేషన్స్ మరియు మిగిలిన విషయాలు గురుంచి ఇంకా తెలియాల్సిఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here