17990/- లకు ఇండియా లో విడుదలైనా వివో S1

0

ఇండియా లో వివో కంపెనీ మరో కొత్త మొబైల్ వివో S1 ను విడుదల చేసింది.మీడియా టెక్ హీలియో P65 ప్రాసెసర్ తో ఇండియా లో విడుదలవ్వుతున్న మొదటి ఫోన్ ఇదే. అలాగే ఈ మొబైల్ 6.38ఇంచ్ ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ స్క్రీన్ మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో రానున్నది. అలాగే బ్యాక్ 16ఎంపీ సోనీ IMX 499 మెయిన్ కెమెరా +8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ +2ఎంపీ డెప్త్ సెన్సార్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 32ఎంపీ కెమెరా తో రానున్నది. ఇంకా 4500mAh బ్యాటరీ కెపాసిటీ తో మరియు డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో రానున్నది.

ఇండియా వివో S1 స్పెసిఫికేషన్స్:

1.మీడియా టెక్ హీలియో P65(12nm) ప్రాసెసర్ తో
2.6.38ఇంచ్ ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ స్క్రీన్ మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో
3.ఇన్ డిస్ప్లై ఫింగర్ ప్రింట్ సెన్సార్
4.బ్యాక్ 16ఎంపీ+8ఎంపీ+2ఎంపీ AI ట్రిపుల్ కెమెరా సెటప్
5.ఫ్రంట్ 32ఎంపీ సెల్ఫీ కెమెరా
6.6జీబీ రామ్ మరియు 128జీబీ స్టోరేజ్ తో
7.ఆండ్రాయిడ్ 9.0 మరియు ఫన్ టచ్ ఓస్ తో
8.4500mAh బ్యాటరీ కెపాసిటీ తో మరియు డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ తో

ఈ మొబైల్ స్కై లైన్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.ఈ మొబైల్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో లభిస్తుంది. 4జీబీ రామ్ మరియు 128జీబీ స్టోరేజ్ ధర 17990/-రూపాయలు 6జీబీ/64జీబీ ధర 18990/- మరియు 6జీబీ/128జీబీ ధర 19990/-రూపాయలుగా వుంది.ఈ మొబైల్ ఆగష్టు 8నుండి సేల్ కి రానున్నది.వీటి లో బేస్ వేరియంట్ మాత్రమే రేపటి నుంచి సేల్ కి రానున్నది. మిగతావి వచ్చే నెలనుంచి అందుబాటులోకి రానున్నాయి.

లాంచింగ్ ఆఫర్స్:
1.HDFC డెబిట్ ,క్రెడిట్ మరియు EMI ట్రాన్సక్షన్స్ మీద 7.5%కాష్ బ్యాక్
2.10000/- విలువ గల జియో బెనిఫిట్స్
3.ఇన్స్టా కాష్ ద్వారా మొబైల్ ఎక్స్చేంజి చేసుకునే వారికీ 10% ఎక్సట్రా వాల్యూ
4.బజాజ్, HDB, HDFC,పైన్ లాబ్స్,IDFC లపై జీరో డౌన్ పేమెంట్ మరియు నో కాస్ట్ EMI
5.వోడా ఫోన్,ఐడియా,ఎయిర్ టెల్ నెట్ వర్క్ లపై ప్రకటించని ఆఫర్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here