2020 సామ్ సుంగ్ గాలక్సీ A సిరీస్ మొబైల్స్ కెమెరా లో రానున్న మార్పులు

0

2019 లో సామ్ సుంగ్ కంపెనీ విడుదల చేసిన A సిరీస్ మొబైల్స్ చాలా బాగా ఆదరణ పొందాయి. ఇంకా A సిరీస్ లో చివరిదైన A90 మొబైల్ విడుదల కావలిసి వుంది. అయితే 2020లో రానున్న A సిరీస్ మొబైల్స్ మోడల్ నంబర్స్ కు సామ్ సుంగ్ ఇప్పటికే ట్రేడ్ మార్క్ పొందింది.

ప్రఖ్యాత లీక్ స్టార్ సుధాన్షు అంభరోస్ 2020లో రానున్న A సిరీస్ మొబైల్స్ రానున్న కెమెరా సెటప్ లోని మార్పులకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసాడు. ఈ లీక్స్ ప్రకారం లో ఎండ్ మొబైల్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ తో రానున్నది. లో ఎండ్ మొబైల్స్ A21,A31,A41 మొబైల్స్ మెయిన్ కెమెరా+ అల్ట్రా వైడ్ అంగెల్+ డెప్త్ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో రానున్నాయి .

ఇంకా మిడ్ రేంజ్ మొబైల్స్ A51,A61 మొబైల్స్ మెయిన్ కెమెరా+ అల్ట్రా వైడ్ అంగెల్+ డెప్త్ సెన్సార్+టెలి ఫోటో లెన్స్(2X) తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ మరియు A71,A81,A91 మొబైల్స్ మెయిన్ కెమెరా+ అల్ట్రా వైడ్ అంగెల్+ టెలి ఫోటో+TOF3డి కెమెరా తో కూడిన సెటప్ తో రానున్నాయి. వీటిలో హై ఎండ్ మొబైల్స్ A81 మొబైల్ 64ఎంపీ కెమెరా,మరియు A91మొబైల్ 108ఎంపీ కెమెరా అలాగే ఈ రెండు మొబైల్స్ 5X ఆప్టికల్ జూమ్ తో కూడిన టెలి ఫోటో లెన్స్ తో రానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here