2599/-రూపాయలకు ఫ్లిప్ కార్ట్ నేషనల్ డే సేల్ లో విడుదలైన హానర్ బ్యాండ్ 5

0

హానర్ బ్యాండ్ 5 ను హానర్ కంపెనీ ఇండియా లో విడుదల చేసింది. ఈ సారి హానర్ కంపెనీ ఈ బ్యాండ్ ను కలర్ డిస్ప్లే తో తీసుకొచ్చింది.ఈ బ్యాండ్ ను ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న నేషనల్ షాపింగ్ డేస్ నుండి సేల్ కి రానున్నది. ఈ బ్యాండ్ 0.95 ఇంచ్ అమోల్డ్ కలర్ డిస్ప్లే తో వస్తుంది. ఈ బ్యాండ్ లో ట్రూ స్లీప్ ట్రాకింగ్ అలాగే నిరంతరం గుండె పనితీరులను పరీక్షిస్తుంది. అంతే కాకుండా ఈ బ్యాండ్ లో ఆటో మాటిక్గా 10రకాల ఆక్టివిటీస్ ను మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యాండ్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ తో మరియు వివిధ రకాల వాచ్ ఫేసెస్ తో వస్తుంది. అయితే చైనా హానర్ బ్యాండ్ 5 లో ముఖ్యమైన ఫీచర్ అయినా SPO2 అంటే రక్తం లోని ఆక్సిజన్ లెవెల్స్ ను గుర్తించడం ఇండియన్ హానర్ బ్యాండ్ 5 లో ఉందొ లేదో హానర్ కంపెనీ ప్రకటించలేదు.

హానర్ బ్యాండ్ 5 స్పెసిఫికేషన్స్:
1. 0.95 ఇంచ్ అమోల్డ్ కలర్ డిస్ప్లే
2.బ్లూ టూత్ వెర్షన్ 4.2
3.మినిమం ఆండ్రాయిడ్ ఓస్ 4.4 ఆపై
ఐ ఓస్ 9.0 ఆపై
4.పీడో మీటర్ , స్లీప్ ట్రాకింగ్ , ఎక్స్ర్సిజ్ ట్రాకింగ్ మొదలగు ఆక్టవిటీస్
5.PPG హార్ట్ రేట్ సెన్సార్ ద్వారా నిరంతరం గుండె పనితీరు ను పరీక్షించడం
6.100mAh బ్యాటరీ 20రోజుల స్టాండ్ బై టైం
7.ఇన్ కమింగ్ కాల్స్ ను మ్యూట్ చేయడం అలాగే నోటిఫికేషన్ అలర్ట్స్

ఈ బ్యాండ్ 3రకాల కలర్స్ అంటే మెటీరిట్ బ్లాక్ , మిడ్ నైట్ బ్లూ, పింక్ కలర్స్ లో లభిస్తుంది.ఈ బ్యాండ్ ను ఇండియా లో 2599/-రూపాయలకు లభిస్తుంది.ఈ బ్యాండ్ ఫ్లిప్కార్ట్ ఎక్సక్లూసివ్ గా లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here