Google Play Music కొత్త రికార్డ్

3

Google Play Music కొత్త రికార్డ్ ని నెల కొలిపింది. ఈ యాప్ ని  ప్లే స్టోర్ లో 500 కోట్ల మందికి పైగా install చేసుకున్నారు. ఇప్పటికే Google chrome , gmail, గూగుల్ మ్యాప్స్, youtube లాంటి యాప్స్ 500 కోట్ల కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ప్లే మ్యూజిక్ ఈ జాబితాలోకి చేరింది. 500 కోట్ల కి పైగా install చేసుకున్న యాప్స్ లో గూగుల్ ప్లే మ్యూజిక్ 6 వ స్థానం లో ఉంది.

గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో pre install అయ్యి వస్తుంది. ఇక నుంచి ఆండ్రాయిడ్ 10 & ఆండ్రాయిడ్ pie మీద మార్కెట్ లోకి విడుదల అవ్వబోయే మొబైల్స్ లో ఈ గూగుల్ ప్లే మ్యూజిక్ pre install అయి ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. గూగుల్ ప్లే మ్యూజిక్ కి బదులు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో గూగుల్ pre install చేయబోతోంది అని వార్తలు వస్తున్నాయి.

మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ కావాలి అంటే, విడిగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి install చేసుకోవాలి. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో గూగుల్ play music app ఉంటుంది కానీ, యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ఉండదు. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ కావాలంటే, మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి install చేయ వలిసిఉంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here