త్వరలోనే ఇండియా లో విడుదల కానున్న రెడీమి బుక్ లాప్ టాప్స్

0

షియోమీ రెడీమి కంపెనీ త్వరలోనే లాప్ టాప్స్ లోకి అడుగుపెట్టనున్నది. ఇప్పటికే మీ మరియు రెడీమి బ్రాండ్ పేరుమీద చైనా లో లాప్ టాప్స్ ను విడుదల చేసింది. 2018లో ఒక ఈవెంట్ లో మను కుమార్ జైన్ ఇండియా కి త్వరలోనే గేమింగ్ ప్రాముఖ్యం గల లాప్ టాప్స్ తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పడు ఆ మాటలు నిజం కానున్నాయి. అయితే గేమింగ్ లేదా మాములు లాప్ టాప్ తీసుకొస్తారా అనేది తెలియాలి.ఇండియా లో రెడీమి బుక్ పేరు మీద ఒక ట్రేడ్ మార్క్ ఇండియా లో రిజిస్టర్ అయింది. రీసెంట్ గా చైనా లో డిసెంబర్ 2019 లో రెడీమి కే 30 తో పాటు రెడీమి బుక్ 13 అనే లాప్ టాప్ ను విడుదల చేసింది.

ఇప్పుడు ఇండియా లో కూడా ఈ లాప్ టాప్ త్వరలోనే విడుదల కావడానికి అవకాశాలు ఉన్నాయి. చైనా లో విడుదలైన రెడీమి బుక్ 13 రెండు వెర్షన్ లో అంటే 10త్ జనరేషన్ i5 మరియు i7 ప్రాసెసర్ లతో విడుదలయింది. మిగతా స్పెసిఫికేషన్స్ చుస్తే ఈ లాప్ టాప్ 8జీబీ రామ్ ,512జీబీ SSD స్టోరేజ్ మరియు 2GB NVIDIA MX250 గ్రాఫిక్స్ కార్డ్ ను కలిగి వుంది. అలాగే బ్లూ టూత్ 5, రెండు 3.1 USB పోర్ట్స్ ,1HDMI పోర్ట్ మరియు 3.5MM హెడ్ ఫోన్ జాక్ లను కలిగి ఉంది. అలాగే ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం మరియు మైక్రో సాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ తో వస్తుంది. 40Whr బ్యాటరీ 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇంకా i5 ప్రాసెసర్ లాప్ టాప్ ధర RMB 4,499 (సుమారు Rs 46,000) మరియు i7 ప్రాసెసర్ లాప్ టాప్ ధర RMB 5,199 (సుమారు Rs 53,500) గా ఉంది. ఇండియా లో వీటి ధర మరియు విడుదల కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here