ఫ్లిప్కార్ట్ ఎక్సక్లూజివ్ గా విడుదల కానున్న హానర్ 9X మొబైల్

0

హువాయి కంపెనీ మీద అమెరికా నిషేధం తర్వాత హువాయి మరియు దాని అనుబంధ కంపెనీ హానర్ ఇండియా లో మొబైల్స్ ను విడుదల చేయలేదు. ఇప్పుడు చాలా రోజుల తరవాత హానర్ కంపెనీ ఇండియా లో హానర్ 9X కొత్త మొబైల్ ను విడుదల చేయనున్నది.ఈ మొబైల్ ను హానర్ కంపెనీ చైనా లో 2019 అక్టోబర్ లో నే విడుదల చేసింది. అలాగే హానర్ కంపెనీ ఈ మొబైల్ ను చైనా లో 9X మరియు 9X ప్రో అనే రెండు మోడల్స్ లో విడుదల చేసింది. ఇంకా ఇండియా కి వచ్చేసరికి ఈ మొబైల్ విడుదల చాలా అంటే చాలా ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ ఎక్సక్లూజివ్ గా రానున్నది,ఇప్పటికే దీనికి సంభందించిన పోస్టర్స్ ఫ్లిప్కార్ట్ లో ప్రదర్శితమవుతున్నాయి.

ఇంకా మొబైల్ చైనా లో విడుదలైన దాని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే పాత తరపు కిరిణ్ 710F ప్రాసెసర్ తో రానున్నది. అలాగే 6.59ఇంచ్ ఫుల్ HD+ ఎల్సిడి డిస్ప్లే తో విడుదలైంది. ఇంకా బ్యాక్ 48ఎంపీ+8ఎంపీ అల్ట్రా వైడ్+2ఎంపీ డెప్త్ కెమెరాల తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 16ఎంపీ పాప్ అప్ కెమెరా తో విడుదల అయింది.చైనా లో రెండు మోడల్ మొబైల్స్ ను 710F ప్రాసెసర్ తో పాటు 810ప్రాసెసర్ తో కూడా విడుదల చేసారు.ఇండియా లో ఈ మొబైల్ ను చైనా లో విడుదల చేసిన 9X స్పెసిఫికేషన్స్ తో విడుదల చేస్తోరో లేదా మార్పు చేసిన స్పెసిఫికేషన్స్ తో విడుదల చేస్తారో చూడాలి ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here