స్నాప్ డ్రాగన్ 730జి తో రెడీమి నోట్ 8ప్రో రానున్నందా ……… ?

0

రెడీమి నోట్ 8ప్రో కొద్దీ రోజుల క్రింద విడుదలై చాలా పాపులర్ అయింది. ఈ మొబైల్ మీడియా టెక్ హీలియో జి90టీ ప్రాసెసర్ మరియు క్వాడ్ కెమెరా సెటప్ తో ఇండియా మరియు గ్లోబల్ గా విడుదల అయింది. ఇప్పుడు ఈ మొబైల్ కి అప్డేటెడ్ వెర్షన్ అంటే స్నాప్ డ్రాగన్ 730జి ప్రాసెసర్ తో రానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చైనా లో M1912G7BE మరియు M1912G7BC అనే రెండు మోడల్ నంబర్స్ తో రెండు రెడీమి మొబైల్స్ 3C(China Communications Commission) సర్టిఫికేషన్ పొందాయి. వీటిలో M1911U2E మోడల్ రెడీమి కే30 మొబైల్ , ఈ మొబైల్ మీడియా టెక్ 5జి ప్రాసెసర్ తో రానున్నది. ఇప్పటి వరకు వచ్చినా లీక్స్ ప్రకారం ఈ మొబైల్ ను డిసెంబర్ 2019 లో విడుదల చేయన్నుట్లు సమాచారం. ఇంకా M1912G7BC మోడల్ నెంబర్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 730జి తో కూడిన రెడీమి నోట్ 8ప్రో మొబైల్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ మోడల్ నెంబర్ ను పోకో f2 అన్ని నెట్ లో ఊహాగానాలు హల్చల్ చేసాయి. కానీ ప్రస్తుతానికి ఈ సంవత్సరం పోకో f2 విడుదల లేనట్లు కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దీ రోజులు ఆగితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here