స్నాప్ డ్రాగన్ 765జి ప్రాసెసర్ తో గీక్ బెంచ్ లో మెరిసిన వివో కొత్త మొబైల్

0

2020సంవత్సరం లో 5జి మొబైల్స్ హవా మొదలు కానున్నది. ప్రతి కంపెనీ కూడా 5జి మొబైల్స్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ మొబైల్స్ పై. ఇప్పుడు తాజాగా వివో కంపెనీ కి సంబంధించిన ఒక మొబైల్ స్నాప్ డ్రాగన్ 765జి ప్రాసెసర్ తో గీక్ బెంచ్ లో మెరిసింది.

గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ V1963A అనే మోడల్ నెంబర్ తో రిజిస్టర్ అయింది. అలాగే మొబైల్ స్నాప్ డ్రాగన్ 765జి మరియు 6జీబీ రామ్ తో మరియు ఆండ్రాయిడ్ 10 తో రానున్నది. అలాగే ఈ మొబైల్ సింగల్ కోర్ లో 2129 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 5279స్కోర్ చేసింది. చైనా నుంచి వస్తున్నా సమాచారం ప్రకారం వివో కంపెనీ ఒక కొత్త అంటే S లేదా Z సిరీస్ తో ఈ మొబైల్ తీసుకురానున్నట్లు సమాచారం . ఇప్పటికే ఇదే ప్రాసెసర్ రెడీమి కే30, రియల్ మీ X 50, ఒప్పో రెనో 3 5జి మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here