13990/-రూపాయలకు ఇండియా లో విడుదలైన వివో Y19

0

వివో కంపెనీ ఇండియాలో యువత కోసం మరో మొబైల్ ను అంటే Y19 అనే మొబైల్ ను విడుదల చేసింది. ఇదే మొబైల్ ను రీసెంట్ గా థాయిలాండ్ లోను విడుదల చేసింది అలాగే ఇదే మొబైల్ ను చైనా లో వివో Y5s గా విడుదల చేసింది. ఈ మొబైల్ ను ఆఫ్ లైన్ మార్కెట్ లను దృష్టిలో పెట్టుకుని వివో కంపెనీ విడుదల చేసింది.

ఇంకా ఈ మొబైల్ మీడియా టెక్ హీలియో P65 ప్రాసెసర్ తో వస్తుంది అలాగే 5000mAh బాటరీ కెపాసిటీ మరియు 18W డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.అలాగే బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 16ఎంపీ కెమెరా సెటప్ ను కలిగి వుంది . అంతే కాకుండా ఈ మల్టీ టర్బో మరియు గేమ్ స్పేస్ వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంది. ఈ మొబైల్ ప్రస్తుతానికి 4జీబీ రామ్ మరియు 64జీబీ స్టోరేజ్ లో మాత్రమే లభిస్తుంది.

వివో Y19 స్పెసిఫికేషన్స్:
1.6.53ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో
2.మీడియా టెక్ హీలియో P65 ప్రాసెసర్ తో
3. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ 16ఎంపీ మెయిన్ కెమెరా +8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా +2ఎంపీ డెప్త్ కెమెరా
4. ఫ్రంట్ 16ఎంపీ కెమెరా
5.ఆండ్రాయిడ్ 9.0 ఫన్ టచ్ ఓస్ 9.2 తో
6. 4జీబీ రామ్ మరియు 64జీబీ స్టోరేజ్,మైక్రో SD సపోర్ట్ తో
7.మల్టీ టర్బో మరియు గేమ్ స్పేస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here